下一个

సైదాపురం నెల్లూరు జిల్లాలోనే ఉంచండి... డిపి పోలయ్య...#msnews75

15 意见· 18 十二月 2025
Ms
Ms
13 订户
13

⁣సైదాపురం ను నెల్లూరు జిల్లా లోనే కొనసాగాలి లేదా గూడూరు ను జిల్లా చేయాలి - జె ఏ సి కన్వీనర్ డి పి పోలయ్య


యాంకర్ పార్ట్ :- సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ లేకపోతే గూడూరు ను జిల్లా చేయాలని సైదాపురం మండలం లో నెల్లూరు జిల్లా లో మూడు మండలాల కొనసాగింపు కు జె ఏ సి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది . ఈ దీక్షకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఎం ఎస్ ఎఫ్ సంఘాలు మద్దతు ను తెలిపాయి.


వాయిస్ ఓ వర్.. .సైదాపురం మండలాన్ని తిరుపతి జిల్లా లో కలప వద్దంటూ రెండో రోజు కు దీక్షలు చేరుకున్నాయి.ప్రజలు సైదాపురం మండలం ను నెల్లూరు జిల్లా లో కొనసాగించాలంటు
జరుగుతున్న దీక్షలకు స్వచ్ఛందంగా మద్దతుగా దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా దీక్షకు సంఘీభావం తెలిపిన సంఘాల నేతలు ఎం అనిల్ ,ఆత్మకూరు పెంచలయ్య లకు ఆహ్వానించి నల్ల కండువాలు ను కప్పి దీక్షకు ఆహ్వానించారు..అనంతరం జే ఏ సి కన్వీనర్ డి పి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం మండలానికి చారిత్రకంగా, పరిపాలనా పరంగా, సామాజికంగా నెల్లూరు జిల్లాతోనే బలమైన అనుబంధం ఉందని, ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం లో విభజన కమిటీ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని హెచ్చరించారు,లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామనిహెచ్చరించారు.అనంతరం జే ఏ సి సభ్యులు జి వి రత్నం షఫీ లు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్రంతోనే ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయని, మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని . ప్రజాస్వామ్య పద్ధతిలో మండల ప్రజల అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం గౌరవించి మండలాన్ని నెల్లూరు జిల్లా లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ ఎన్ గంగాధర్,ఎస్ కెషఫీహరన్ , పూలే టీచర్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మా రవి,ప్రధాన కార్యదర్శి జి వి రత్నం,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కె చంగల్ రావు, ఏ పి యు టి ఎఫ్ మండల సహాయ అధ్యక్షులు ఎం యుగంధర్,యూత్ నాయకులు ఎం పవన్ కుమార్ ,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అనిల్,ఎం ఎస్ ఎఫ్ మండల అధ్యక్షులు ఆత్మకూరు పెంచలయ్య ,మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు .

显示更多

 2 注释 sort   排序方式


Shanuka safar
Shanuka safar 1 天 前

sabhi ko ek dusre ko support karna chahie taki hamare India ka bhi Koi YouTube ke jaisa platform ho aur pure world mein uska ek alag hi status Ho

0    0 回复
Kulwant singh
Kulwant singh 8 天 前

“मैंने आपका यह चैनल दिल से सब्सक्राइब कर लिया है। आपका कंटेंट सच में बहुत अच्छा लगा। अगर आप भी मेरे चैनल को एक बार देखकर सब्सक्राइब कर दें तो मुझे बहुत खुशी होगी। आपका सहयोग मेरे लिए बहुत मायने रखता है। धन्यवाद 🙏”

0    0 回复
Shanuka safar
Shanuka safar 1 天 前

aise hi ek dusre ko support karte rahiye taki Ham apna tube ko ek world best platform app banaa sake aur YouTube ki tarah hi apna tube ka bhi ek alag se hi status Ho

   0    0
显示更多