సర్దార్ వల్లభాయ్ పటేల్ & పొట్టి శ్రీరాములు వర్ధంతి నివాళులు... పేట బ్రదర్స్...#msnews75
*భారతదేశ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
మన భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది గొప్ప చరిత్ర, ఆయన భారతదేశ తొలి ఉప ప్రధాని గా, హోం మంత్రిగా, దాదాపు 500 సంస్థానాలను మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనదేశంలో విలీనం చేయడంలో ఎంతో గొప్ప కృషి చేశారు, అందుకే పటేల్ గారికి *ఉక్కుమనిషి* అనే బిరుదు ఇవ్వడం కూడా జరిగింది, మరొక స్వాతంత్ర సమరయోధులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర ఉద్యమంలోనూ, మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించి మనకు ఆంధ్ర రాష్ట్రం అవతరించడంలో ముఖ్యమైనటువంటి గొప్ప మనిషి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు , ఈరోజు వీరిద్దరి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం ఒక గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, ప్రదీప్ కుమార్, నవీన్, లక్ష్మణ్, మహర్షి రెడ్డి, భాను ప్రకాష్, హరి, ముని చంద్ర, రమేష్ బాబు, చందు, గోపి
*వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు*
.
