సైదాపురం బంద్ విజయవంతం... డిపి పోలయ్య
సైదాపురం ను నెల్లూరు జిల్లా లో కొనసాగింపు కోసం నాలుగోరోజు సైదాపురం మండలం బంద్ విజయవంతం
సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లా లో కొనసాగించాలని కోరుతూ సైదాపురం మండలం కేంద్రం లో నిరసన దీక్షలు నాలుగో రోజు చేరుకున్న సందర్భంగా జె ఏ సి యిచ్చిన పిలుపు తో శుక్రవారం వ్యాపారాలు , స్కూల్ లు, జూనియర్ కాలేజ్ మూత పడింది.ప్రజలు స్వచ్ఛందంగా సైదాపురం ను నెల్లూరు జిల్లా లో ఉంచాలని ముందుకొచ్చి బంద్ ను పాటించారు. దీంతో సైదాపురం లో బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జె ఏ సి సభ్యులు పూలే టీచర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు తుమ్మా రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నాటి ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు జరుగుతూనే వుందన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా మంత్రుల కమిటి నీ తీసుకొచ్చి సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను 40 కిలోమీటర్ల కు దూరం లో వున్న నెల్లూరు జిల్లా కేంద్రాన్ని దూరం చేసి 160 కిలోమీటర్ల దూరం లో వున్న తిరుపతి లో కలిపే విధంగా దుర్మార్గం గా ప్రకటించిందని దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని మూడు మండలాలను నెల్లూరు జిల్లా లో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జె ఏ సి కో కన్వీనర్ షఫీ హరన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మంత్రుల కమిటి పేరుతో అక్రమ నివేదికలు తెప్పించి మూడు మండలాలను తిరుపతి లో కలపాలన్న ప్రతిపాదనను ప్రజలు ఈ ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలు మూడు మండల లను కలిపే ప్రతి పాదనను వెనక్కి తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని గుర్తించాలని హెచ్చరించారు. మాదిగ దండోరా మండల నాయకులు గంగాధర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం మూడు మండలాలను తీసి తిరుపతి లో కలిపే ప్రతి పాదన తీసుకు రావటం పట్ల ప్రజలు ఆందోళన ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారన్నారు. అప్రతిపాదన ను విరమించుకుని నెల్లూరు జిల్లా
లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జె ఏ సి మండలం కన్వీనర్ డి పి పోలయ్య మాట్లాడుతూ బడా కార్పొరేట్ శక్తులు ధనార్జన కోసం ప్రజల అభిప్రాయం లేకుండా తిరుపతి జిల్లా లో మూడు మండలాలను కలుపుకోవాలని మంత్రుల కమిటి తో చీకటి ప్రతిపాదనను తీసుకురావడం ప్రజల్లో నెల్లూరు జిల్లా లో మూడు మండలాలను కొనసాగించాలని డిమాండ్ తో పోరాటాలకు సచ్చందంగా ముందుకు వస్తున్నారన్నారు.ప్రజలు కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగలు ప్రశాంతం గా సంతోషం గా జరుపుకోవా లాంటే నెల్లూరు జిల్లా లో సైదాపురం రాపూరు కలువాయి లను యథావిధి గా నెల్లూరు లో కొనసాగించాలిలేదా గూడూరు ను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పూలే టీచర్ ఫెడరేషన్ నాయకులు జి వి రత్నం, బి ప్రసాద్, యుటి ఎఫ్ నాయకులు పి సోమయ్య, ఆర్ వి రమణయ్య, బి జె ఏ నాయకులు వి రఘు రామ్, టి చిట్టి బాబు, కె పరంధామయ్య, ఏ పి టి ఎఫ్ నాయకులు కె రవి, ఎన్ వెంకటేశ్వర వర్మ, ఎస్ డి షరీఫ్ బాబు, ఎం చిరంజీవి,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కె చంగల్ రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం అనిల్ ,తదితరులు పాల్గొన్నారు.

ek dusre ke channel ko subscribe karo aur aise hi support karo taki Ham apna tube Ko bhi YouTube se bada platform banaa saken