次に

గిరి ప్రదక్షణ భక్తులకు వాహనదారుల శబ్దాలు ఇబ్బందిగా ఉంది... గరికపాటి రమేష్

54 ビュー· 25 12月 2025
Ms
Ms
16 加入者
16

⁣తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తి


దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నందు ప్రతియేట శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు సంప్రదాయబద్ధంగా ఎంతో వైభవంగా రెండు పర్యాయములు సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు ఒకసారి, శివరాత్రి సమయంలో రొండోసారి గిరి ప్రదక్షణ నిర్వహిస్తారు మోతగాళ్ళచే స్వామి అమ్మవార్లను మోసుకుని గిరి ప్రదక్షణ చేస్తారు ఆ ఆదిదంపతులవెంట కొన్ని వేలసంఖ్యలో భక్త జనం గిరి ప్రదక్షణకు వెళుతుంటారు ఇదివరకు పిచ్చాటూరు మార్గంగుండా తారు రోడ్డు మీదుగా స్వామి అమ్మవార్లు భక్తులు గిరి ప్రదక్షణ చేసేవారు ఆ మార్గం గుండా వాహనాలు రాక పోకలు ఎక్కువగా ఉండడం, ప్రమాదాలు జరగడం వంటి వాటిని ద్రుష్టి లో ఉంచుకొని గిరి ప్రదక్షణకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొండలను ఆనుకొని కొన్ని కోట్లు ఖర్చు చేసి రహదారిని నిర్మించడం జరిగింది కానీ ఈ మార్గంగుండా గిరి ప్రదక్షణ సమయంలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం,ఆకతాయిలు, అల్లరిమూకాలు అధిక శబ్దంతో హారన్స్ కొడుతూ అతి వేగంతో బైక్స్ నడుపుతూ నడిచివేల్లే భక్తులను ఇబ్బంది పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఈ కారణం చేత కార్లు,బైక్స్,ఆటోలు వంటి వాహనాలను దేవస్థానం వారు గిరి ప్రదక్షణ కొరకు నిర్మించిన మార్గం గుండా అనుమతించకుండా పిచ్చాటూరు మార్గం తారు రోడ్డు మీదుగా ఆ వాహనాలను గిరి ప్రదక్షణ రోజు మర్లించాలని కోరుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ హిందూ ధార్మిక మండలి కన్వీనర్ గరికపాటి రమేష్ బాబు వారి మిత్ర బృందంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈ.ఓ బాపి రెడ్డి, ధర్మకర్తలమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ,ధర్మకర్తల మండలి సభ్యులు కోలా విశాలాక్షి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందిస్తూ రహదారిని పరిశీలించి తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటామని అవరమైతే రమేష్ బాబు సహాయంకుడా తీసుకుంటామని ఇటువంట మంచి సలహాలు సూచనలు తమకు ఎల్లవేళల అందించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.


ఈకార్యక్రమంలో గరికిపాటి రమేష్ బాబు, చిలకా రంగయ్య, గోపాలయ్యా,కన్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

もっと見せる

 0 コメント sort   並び替え


次に