ショーツ 作成
*జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న పేట బ్రదర్స్ మిత్రబృందం*
సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారి నాయకత్వంలో పెళ్లకూరు మండల నాయకులు తాళ్ల రెడ్డి శ్రీనివాస్ గారు నిర్వహించిన పునబాక గ్రామం నందు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది.
సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, సూళ్లూరుపేట నియోజకవర్గంలోనీ అన్ని పంచాయతీలలో మన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరగాలని నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, మరియు ఈ రోజు తాల్ల రెడ్డి శ్రీనివాస్ ఘనంగా తన గ్రామంలో జండా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు, మండల జనసేన నాయకులు, వీర మహిళలు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, ప్రదీప్ కుమార్, మహేష్, మనీ, నాదెండ్ల రాజేష్, లక్ష్మణ్, దినేష్, హరి, రాజా, గోపి, చెంబెడు జానీ, శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు





